కవిత
సమాజమా సిగ్గుపడు
నిగ్గదీసి అడుగుతున్న...... సిగ్గులేని సమాజాన్ని ....
నిక్కచ్చిగా అడుగుతున్న .... నికృష్టపు సమాజాన్ని ......
తడి ఆరిన గొంతుక తో .... తడపడుతు అడుగుతున్న.....
పూల మొక్క పై మొలిచిన కంటకాలు.... పూలకు హాని చేయవు .....
సమాజం లో పుట్టిన నీవు .... సమాజాన్ని నాశనం చేస్తున్నావు .......
కనికరం లేని కఠి నాత్ముడా ......కాల సర్పమై కన్న కూతుర్ని కబలిస్తున్నావు...
మానవత్వం మరచి .... మహిళలను ఏమార్చుతున్నావు ....
పసితనం పై పంజా విసిరి .... మదోన్మత్హ మృగానివై పశువాంచలు తీర్చు కుంటున్నావు ...
మైనర్ బాలికల పై దాష్టీకం చేస్తున్నావు ...
తుంటరివై ఒంటరి మహిళ లను ... కబలించి కాటేస్తున్నావు ....
పరాయి స్త్రీ లను తల్లిగా భావించే భారత
దేశం లో తల్లి, చెల్లి, అక్క అనే వావి వరసలు మరచి కామం తో కళ్ళు మూసుకు పోయి
మృగం లా ప్రవర్తిస్తున్నావు.........
పట్టుమని పదేళ్లయిన లేని చిట్టి తల్లులను చిదిమెస్తున్నావు....
పసిమొగ్గల బాల్యాన్నిపశువులా కబలించి...
ధన దాహం తో అక్రమార్కులకు విక్రయించి....
అమాయకపు పడతు లను పతితలు గా చేసి ...
సమాజం లో జీవచ్ఛవాలుగా పడ వేస్తున్నావు ....
సమాజ నాశనానికి కారకుడవుతున్నావు ...
పాశవిక కృత్యాలు సమాజం లో సాధారణ మైపోయాయి. ...
పది మాసాలు మోసి కడుపులో దాచుకున్న మాతృ మూర్తి ని ..
కడవరకు కంటికి రెప్పలా చూసుకోకుండా...
రెక్కలు పెంచుకొని పక్షిలా ఎగిరి పోతున్నావు.....
నడిసంద్రం లో ముంచి నగుబాటు చేస్తున్నావు....
రక్త సంబందం మరచి రిక్త హస్తాల తో వదిలేస్తున్నావు ....
పశుపక్ష్యాదులు కూడా తమ సంతానాన్ని వీడ జాలవు
మనిషివై పుట్టిన నీవు మృగము లాగా ప్రవర్తిస్తున్నావు ...
రాగద్వేషాలు పెంచుకొని రాక్షసుడ వవుతున్నావు.....
సమాజం పట్ల నీ భాద్యతను విస్మరిస్తు న్నావు ....
మానవత్వం మంట గాలిపి, సంస్కారం వీడి ...
తోటి వారిని సాటి వారిని చులకన చేస్తున్నావు ...
నీ సాటి వారికి సాయం చేద్దా మనే ఉహే లేదు ....
సాంఘిక మాధ్యమ కూపం లో పడి కొట్టు మిట్టాడు తున్నావు ....
నడి రోడ్డున ప్రమాద బారిన పడి... చావుబ్రతుకుల మద్య ఊగిస లాడే ఆన్యులను....
చూసి చరవాణి లో బంధించడానికే ఉబలాట పడతావు .... కానీ .....
ఆ దిక్కులేని పక్షిని రక్షిద్దామనే ఆలోచనే లేని అపర ప్రబుద్దుడవు ....
మద్యానికి బానిసవై స మా జానికి చీడ పురుగులా దాపురించావు ....
అర్ధ రాత్రి, అపరాత్రి అని లేకుండా తాగి తందానాలతో కార్లు నడిపి ....
నడిరోడ్డున పోయే అమాయక చక్రవర్తు ల ఆయుస్శు హరించి ....
చట్టానికి చిక్కకుండ .... చుట్టాలను ఆశ్రయించి ....
ధనబలం , భుజ బలం తో, చట్టాల లొసుగు లను శోదించి, ...
కాల రేగరేసు కొని కాకి వలె సంచరిస్తున్నావు.....
రహదారుల పై పాదచారులను నడవ నివ్వకుండా .....
అడ్డదిడ్డం గా వాహనములు నడిపి.... అష్టదిగ్బంధం చేయకండి ...
నీ ముందు వెళ్ళే వాహన దారున్నీ నిదానం గా వెళ్లనివ్వండి.....
రహదారి నియమాలు రక్షణ కొరకే ఏర్పరిచారని మరువకండి....
ఎదుటి వారి రక్షణే నీ రక్షణ .....
బడిలో మీ పిల్లలు నుడికారం మరచి ....వెటకారాలు చేస్తే,
పిల్లల ప్రవర్తనను సమీక్ష చేయకుండా,
గురువులను నిలదీసే సంస్కృతి మానాలి....
గురువుల దండన బిడ్డల భవిష్యత్తు కనీ మరువద్దు
అంతే కాక .... పనికి మాలిన గురువులు కూడా ఉన్నారని అంటాను....
ఆడపిల్లలను గుడ్ టచ్ తో బాడ్ టచ్ చేసి, ....
పైశాచికానందం పొందే కీచక ఉపాద్యాయులారా....
మారండి ...... మారండి ...... మారండి ......
సమాజాన్ని ప్రగతి పధం లో తీసుకెళ్లే....
మార్గాలు వెదకండి, శోధించండి .... సాధించండి.
అగ్గి తో కడిగినా బుగ్గి పాలు తప్ప ....
బుద్ది పాలు కానరాని సమాజ జీవచ్చవమ్ .....
మానవ జాతికి మారణ హోమం ఛూపిస్తున్న....
కుల్లు సమాజాన్ని నిగ్గదీసి అడగాలి.....
నికృష్టపు పనులు మానమని, నిక్కచ్చిగా బ్రతక మని
సమాజ హితం నీ మతం .....సమాజ నీతి నీ రీతి.
సభ్య సమాజాన్ని సజీవం గా ఉండనివ్వండి .......
సూరిబాబు కోమాకుల
పాఠశాల విద్యా సహాయ సంచాలకులు ( రిటైర్డ్)
హస్తినాపురం సెంట్రల్, సాగర్ రోడ్ , హైదరాబాద్ 500079
చరవాణి నం: 9963886728
No comments:
Post a Comment