Saturday, April 12, 2025

కవిత                                                          

                                                              సూరిబాబు కోమాకుల                                                                                       

                                            పాఠశాల విద్యా  సహాయ సంచాలకులు ( రిటైర్డ్

                                                   హస్తినాపురం సెంట్రల్, సాగర్ రోడ్ ,

                                                           హైదరాబాద్ 500 079

                                                   చరవాణి నం: 9963886728

 


ప్రాకృతిక జీవన సుగంధం

మానవ జీవిత రధచక్రాలు ప్రగతి పధం లో నడిచినపుడే

జీవన సౌభాగ్యానికి  తెరలేస్తాయి ....

పూల ఘుమఘుమలు ప్రకాశ వంతమై ...

సువాసనలు వెదజల్లు సమయాన.....

జీవన సారం వెళ్ళి విరిసి ఆనందమయ మవుతుంది.....

పూల మొక్కల తళతళలు .... పువ్వుల సుగంధ వాసనలు ...... 

చల్లగాలి తెమ్మెరలు..... ఆహ్లాదకరముగా ఆవిష్కరింపబడి.......

అనుకోని అనుభూతికి లోనవుఘాయి...... 

పక్షుల కిలకిలా రావములు..... 

తుమ్మెదల ఝుంకార నాదములు.....

పిచ్చుకల సవ్వడి..... పావురాళ్ల కీచులు......

ప్రకృతిని పరవశింప చేసినపుడు .... 

పొందే  ఆనంద మాయ భావనా తరంగాలు ..... 

జీవన తరంగాలలో ఉప్పొందింప జేసి ....... 

రసమయ కాంతులు విరబూసి..... 

రసాత్మక ప్రక్రియకు తెరలేపు చున్నపుడు..... 

ఆనంద భాష్పాలు తెరలు తెరలు గా కన్నులలో కురిపుంచినపుడు ..... 

పొందే భావనా గీతికా సుగంధ పరిమళాలు జీవన సౌందర్యానికి పట్టుకొమ్మలై ...

మానవ జీవిత సుగంధాభి వృద్దికి ఆలంబన గా అమరుతాయి..... 

వినయ విధేయత లో పెరిగే పిల్లల ....

ఆటపాటలు, అల్లరిపనులు, కుర్రచేష్టలు...... 

మానవ మనుగడ లో భాగ మై ......

కుటుంబ భాద్యతలు సక్రమ నిర్వహణ లో ...... 

నిర్వర్తించు సమయాన .... పొందే.... 

హృదయ స్పందన మధురాతి మధురమై

హృదయ కవాటాలు ప్రతిస్పందన చెంది ........

భావి జీవిత సౌభాగ్యానికి సుగంధ పరిమళాలాలు వెదజల్లును ..... 

ఆహార నియమాకు ప్రాధాన్య మిస్తూ .....

మద్యానికి బానిసలుకాకుండా ..... 

కుటుంబ సబ్యులతో ఆనంద కాలక్షేపం తో కాలం గడుపుతూ ..... 

ఆర్ధిక అవసరాలు గమనిస్తూ ...... 

ఆదాయ వ్యాయాల సమతూకం పాటిస్తూ ...... 

నైపుణ్యాలు అలవరచు కుంటూ ...... 

కొత్త ప్రాంత విశేషాలు గమనిస్తూ ..... 

కొత్త కొత్త పరిచయాలు పెంపొందించు కుంటూ .......

సమయ దోనికినపుడు పుస్తకాలతో కుస్తీ పడుతూ .... 

ఆత్మ విశ్వాసాన్ని బలపరచు కుంటూ ..... 

జీవిత రాధాన్ని నడిపితే, ..... 

జీవన సుగంధం పరిడవిల్లు తుంది.... 

శ్రమైక జీవన సౌందర్యం లో ........

పొందే ఆనంద మయ పరిమళాలు....

ఆసాంతం మన హృదయానికి అద్దం పట్టి .... 

అమృత మయ మైన జీవన సౌభాగ్యానికి ..... 

ఆలంబన గా నిలిచి జీవితాన్ని ఆహ్లాద పరుస్తాయి..... 

ఆకాశం లో మబ్బులు తెరలు తెరలుగా తరలు తుంటే, ..... 

మబ్బుల మాటున దినకరుడు దొబుచు లాడుతుంటే ....... 

ప్రాకృతిక పారవశ్యం పరిమలింప జేసి.....

మదిని ఆహ్లాదింప జేయు తరుణాన....

పొందు ఆనంద కేళీ విలాస పర్వం ..... 

జీవిత సౌభాగ్యానికి పట్టుకొమ్మ కాదా ......... 

ప్రాతః కాల వేళ పలకరించు బాల భాస్కరుని ..... 

ప్రభాత కిరణాలు  తనువును తాకుతుంటే .........

సుస్వర గీతాలు స్వర మాధురులై .....

హృదయాన్ని పులకింప జేయు తరుణాన .....

తన్మయత్వం తాండవించి తరుము కొడుతుంటే ........

 రసాను భూతి జీవన ప్రయాణాన్ని ....... 

దిగ్విజయముగా సాగించ మని ప్రోత్సహిస్తుంటే........

విజయానంద పరుడువై నీ కర్తవ్యాన్ని నిర్వహించడానికి  ఉద్యుక్తుడవుతున్న వేళ .....

నీలో ప్రసరించే ఆనంద మయ కిరణాలు ......

నీ జీవిత గమనానికి నాంది పలుకు తున్నపుడు ......

జీవిత మాధుర్యం నీ లక్ష్యాన్ని చేదిస్తున్నపుడు ........

జీవిత మధుర సుగంధం ప్రభంజనమై ....

నీ భావి జీవితానికి ఆలంబనగా మారి .....

అమృతమయ జీవితానికి దారి చూపించి .......

జీవన సుగంధం నీ ఇంటిల్లి పాది ప్రసరింప జేసి……  

ఆనంద మయ జీవితం సాగించు కర్తవ్య నిర్వహణ .... 

నీకు వరమై నీ కుటుంబ సౌభాగ్యం పరిడ విల్లు తుంది .....

అనుటలో సందేహ లేదు.                                                                               

 

 

 

No comments: